డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 35 ఏళ్ల కానిస్టేబుల్ మృతి (వీడియో)

4900చూసినవారు
ఢిల్లీలోని గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ బదిలీ కావడంతో సిబ్బంది అంతా సెండాఫ్ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో రవికుమార్ (35) అనే కానిస్టేబుల్ అందరితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇంతలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కానిస్టేబుల్‌ కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్