మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్రా కుమార్తె పేటోంగ్టార్న్ థాయ్లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ పదవి నుంచి దిగిపోవడంతో.. శుక్రవారం పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా 37 ఏళ్ల పేటోంగ్టార్న్ అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో థాయ్కి రెండో మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలో అతిపిన్న ప్రధానిగా కూడా పేటోంగ్టార్న్ రికార్డు సృష్టించారు.