ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరొందిన ఆగ్రాలోని తాజ్‌మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఫలితంగా ఈ పాలరాతి కట్టడంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు చోట్ల దెబ్బతినడమే కాక, పగుళ్లు కూడా వచ్చాయి. ఇటీవల ఆగ్రాలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇవి మరింత పెరిగినట్టు భావిస్తున్నారు. ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్‌లో ఖురాన్ శ్లోకాలు ఉండేవి. ఇప్పుడవి కనిపించట్లేదని టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి షకీల్ చౌహాన్ తెలిపారు.