దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ATM నెట్‌వర్క్‌లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ATMలు మూతపడ్డాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరగుతుండటమే ఇందుకు కారణం. నిరుడు సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 2.19 లక్షల ATMలు ఉండగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 2.15లక్షలకు తగ్గినట్టు RBI వెల్లడించింది.