మహారాష్ట్రలో 45.53%, ఝార్ఖండ్‌లో 61.47% పోలింగ్ నమోదు

61చూసినవారు
మహారాష్ట్రలో 45.53%, ఝార్ఖండ్‌లో 61.47% పోలింగ్ నమోదు
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో 45.53 శాతం, ఝార్ఖండ్‌లో 61.47 శాతం పోలింగ్‌ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. పోలింగ్‌కి ఇంకా సమయం ఉండడంతో మరింత శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో అత్యధికంగా ఓటింగ్‌ నమోదు కాగా, ముంబై సిటీలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్