గాంధీ హాస్పిటల్‌లో ఒకే నెలలో 48 మంది పిల్లలు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పని చేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా? ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంది” అని కేటీఆర్ అన్నారు.