అత్యాచారం కేసులో నకిలీ పోలీసు అరెస్టు

58చూసినవారు
అత్యాచారం కేసులో నకిలీ పోలీసు అరెస్టు
గుంటూరు బుచ్చయ్యతోట ప్రాంతంలో బీఫార్మసి విద్యార్థినిపై అత్యాచారం చేసిన నకిలీ పోలీసును కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4వ తేదీ తెల్లవారుజామున ఓ ప్రేమజంట బస్టాండ్‌ నుంచి వెళ్తుండగా గుంటూరుకు చెందిన పోతినేని గోపి అనే యువకుడు.. తాను పోలీసునని అడ్డగించి, ఇంటి వద్ద దింపుతానంటూ బైక్ పై అమ్మాయిని ఎక్కించుకుని మార్గమధ్యలో అత్యాచారం చేశాడు. నిందితుడిపై ఇదివరకే 23 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్