రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన ప్రసంగంలో తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయింటినట్లు మంత్రి తెలిపారు. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1,721 పోస్టులను కొత్తగా మంజూరు చేశామని, రూ. 1050 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల భవనాల నిర్మాణం చేపడతామన్నారు.