దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఆధ్వర్యంలోని హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 600 ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్టేషన్లలో ఇతర బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు కూడా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.