ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా (ICBC) డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడకు చెందిన కొల్లి భారతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈమె న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. మదనపల్లెలో చదువుకున్న ఈమె 1999లో బెంగళూరులోని డెల్‌లో కంపెనీలో జాబ్ కొట్టారు. విధుల్లో భాగంగా అమెరికాకు వెళ్లి అక్కడ ప్రతిభ చూపడంతో డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.