మహా కుంభమేళాకు 13 వేల రైళ్లు నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 3వేల ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా 13 వేల రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు. ప్రయాగరాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ జరగనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 2 కోట్ల వరకు భక్తులు రైళ్ల ద్వారా కుంభమేళాకు చేరుకునే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.