కోతుల దెబ్బకు ఏకంగా బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో రెండు కోతులు అరటి పండు కోసం కొట్టుకున్నాయి. వాటిలో ఒక కోతి రబ్బరు లాంటి ఒక వస్తువును మరో దాని మీదికి విసరడంతో రైల్వే ఓవర్ హెడ్ వైర్‌కి తగిలి షాట్ సర్క్యూట్ అయి రైలు నిలిచిపోయింది. చివరకు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ వైర్‌కు మరమ్మతులు చేయడంతో రైలు బయలుదేరింది.