ఈనెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) తెలిపింది. ఇంధన పరిరక్షణ, సామర్థ్యం, ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని బీఈఈ కోరింది.