కలుషితాహారం వల్ల 92 మంది విద్యార్థులకు అస్వస్థత

54చూసినవారు
కలుషితాహారం వల్ల 92 మంది విద్యార్థులకు అస్వస్థత
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 92 మంది విద్యార్థులు కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై.. వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఫుడ్‌పాయిజనింగ్‌ అయినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.