జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రియాసిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల వృద్ధుడు హగీ కరీమ్ దిన్ భట్ తన ఓటు హక్కును వినియోగించుకుని ఆందరిని ఆశ్చర్యపరిచారు. ఓటేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అభివృద్ధి పనులు బాగా జరుగుతాయని అన్నారు. పిల్లలకు మంచి విద్య లభిస్తుందని చెప్పారు.