జేబులో ఉంచుకున్న బాణాసంచా పేలి రాజస్థాన్ లోని జుంఝునులో హిమాన్షు అనే 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వార్తా కథనాల ప్రకారం బాలుడు సోమవారం ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్లి సల్ఫర్, పొటాష్ కొనుక్కొచ్చాడు. స్నేహితుడితో కలిసి వాటితో బాణాసంచా తయారు చేశాడు. వాటిలో కొన్ని పేల్చసాగాడు. మరికొన్ని గాజు సీసాలో నింపి జేబులో పెట్టుకున్నాడు. అయితే టపాసులు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వ జేబులోని బాటిల్ కు తగిలి ఒక్కసారిగా పేలిపోయి మృతి చెందాడు.