బీహార్‌లోని సహర్సాలో శనివారం 14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు మేకల మేత కోసం వెళ్ళి వస్తున్న బాలికను తుపాకీతో బెదిరించి కారులోకి ఎక్కించుకుని అత్యాచారం చేశారు. దాదాపు 2 గంటల తర్వాత బాలికను విడిచిపెట్టారు. అయితే బాలిక ఇంటికి రావడం ఆలస్యమవడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను బిట్టు, అంకుష్‌గా గుర్తించారు.