బండి మీద ప్రాణాలు విడిచిన వ్యక్తి (Video)

65చూసినవారు
మన జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తాజాగా ఒడిశాలో జరిగిన ఓ విషాద ఘటనను చూస్తే మనిషి చావు ఇలా కూడా వస్తుందా అని అనుకుంటాం. ఓ వీధి వ్యాపారి టీవీఎస్ బండిపైన తినుబండారాలు అమ్ముకుంటున్నాడు. వర్షం రావడంతో ఓ షాపు ముందు ఆగాడు. కానీ ఇంతలోనే గుండెనొప్పితో ప్రాణాలు వదిలాడు. రోజు బతుకు లాగించిన బతుకు బండి మీదనే ప్రాణాలు వదలడం అందరిని కలిచివేసింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్