తిరుపతిలో 14 ఏళ్ల విద్యార్థినిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక నెహ్రూ మున్సిపల్ స్కూల్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని ఓ ప్రభుత్వ బాలికల వసతి, పరిశీలన గృహంలో ఉంటూ 9వ తరగతి చదివే బాలికపై రుషి అనే వ్యక్తి బ్రేక్ సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు హాస్టల్ కు సరకులు సరఫరా చేస్తాడని, ఈ క్రమంలోనే బాలికతో పరిచయం పెంచుకున్నాడాని చెప్పారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.