ఏపీలో సంక్రాంతి కళ లేదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. 'రూ.6,700 కోట్ల బకాయిల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. రూ.850 కోట్లతో రోడ్డును బాగు చేశాం. రైతులకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడినవారు పండుగకు సొంతూళ్లకు వచ్చారు' అని పేర్కొన్నారు.