పండుగ పూట తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డక్కిలి మండలం నరసనాయుడపల్లిలో తెలుగు గంగ కాలువలో పడి ఓ బాలుడు మరణించాడు. చరణ్, విశాల్ అనే ఇద్దరు బాలురు ఆడకుంటూ ప్రమాదవశాత్తూ తెలుగు గంగ కాలువలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే విశాల్ అనే బాలుడిని కాపాడారు. చరణ్‌ను కూడా ఒడ్డుకు తీసుకురాగా అతను అప్పటికే మరణించాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.