వేలు నరుక్కొని కాళీ మాతకు అర్పించిన బీజేపీ కార్యకర్త

84చూసినవారు
వేలు నరుక్కొని కాళీ మాతకు అర్పించిన బీజేపీ కార్యకర్త
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తొలిట్రెండ్స్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండడంతో బీజేపీ కార్యకర్త దుర్గేష్ పాండే ఆందోళన చెందాడు. స్థానిక కాళికదేవి ఆలయానికి వెళ్లి బీజేపీ గెలుపు కోసం ప్రార్థించాడు. చివరకు బీజేపీ అత్యధిక సీట్లు సాధించడం, ఎన్డీయే కూటమికి మెజారిటీ స్థానాలు రావడంతో పాండే సంతోషం పట్టలేకపోయాడు. తిరిగి కాళీమాత ఆలయానికి వెళ్లాడు. ఎడమ చేతివేలు నరుక్కొని అమ్మవారికి సమర్పించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.