తొడలో ఇరుక్కున్న చెట్టుకొమ్మ.. బాధితుడు విలవిల

67చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాలో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన జరిగింది. మానవపాడు(M) మద్దూరు గ్రామానికి చెందిన మాలిక్ (28) ట్రాక్టర్లో ఇసుక లోడుతో వెళ్తుండగా అమరవాయి గ్రామ శివారులో బోల్తా పడింది. ఈ సంఘటనలో మాలిక్ (28) తొడ భాగంలో చెట్టు కొమ్మ ఇరుక్కుంది. తీవ్రంగా గాయపడి 15 నిమిషాల పాటు నొప్పిని భరిస్తూ కేకలు వేశాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ చంద్రకాంత్, గ్రామస్తులు చేరుకుని రంపంతో వీలైనంత వరకు కొమ్మను తీసేసారు. అతడిని వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్