భార్య ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానని బెదిరిస్తున్న భర్తపై కేసు నమోదు

80చూసినవారు
భార్య ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానని బెదిరిస్తున్న భర్తపై కేసు నమోదు
వ్యక్తిగత ఫోటోలు బయటపెడతానని భార్యను బెదిరిస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదారాబాద్ ఫిల్మ్ నగర్‌కు చెందిన ఓ మహిళ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు కోసం ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. డబ్బు ఇవ్వకపోతే తన వద్ద ఉన్న ప్రైవేట్ ఫోటోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడని తెలిపింది. ఆ భయంతో దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు ఇచ్చినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్