ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ చిన్న అమ్మాయి హెల్మెట్ లేకుండా తండ్రిని వెనుక కూర్చొని బైక్ నడుపుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. చిన్న పిల్లకు హెల్మెట్ కూడా లేకుండా తండ్రి బైక్ ఎలా ఇచ్చాడు అని మండిపడుతున్నారు. ఈ దృశ్యాలు చూడడానికి బాగానే ఉన్నా.. చిన్న పిల్లతో మెయిన్ రోడ్డుపై బైక్ నడిపించడం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు.