కమర్షియల్ రాకెట్ లిజియన్-1ను ఇవాళ చైనా ప్రయోగించింది. 5 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఆ రాకెట్ వాటిని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు సమాచారం. లిజియన్-1 రాకెట్‌ను సీఏఎస్ స్పేస్ అభివృద్ధి చేసింది. జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం 7.33 నిమిషాలకు ఈ పరీక్ష జరిగింది. ఈ 5 ఉపగ్రహాల్లో.. 2 ఎయిర్‌శాట్ కంపెనీ ఉపగ్రహాలు ఉన్నాయి. జిలిన్-1 ఎస్ఏఆర్01ఏ, యున్యావో-1 శాలిలైట్లను ల్యాండ్ సర్వే, వాతావరణ స్టడీ కోసం వాడనున్నారు.