స్కూల్‌కు తుపాకీతో వచ్చిన ఐదేళ్ల బాలుడు

52చూసినవారు
స్కూల్‌కు తుపాకీతో వచ్చిన ఐదేళ్ల బాలుడు
బీహార్‌లోని సుపాల్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు స్కూల్‌కి తుపాకీ తీసుకొచ్చాడు. 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో బాధిత బాలుడి చేతికి బుల్లెట్ తగిలింది. గాయపడిన బాలుడిని టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్పీ శైశవ్ యాదవ్ స్పందించారు. నర్సరీ చదివే విద్యార్థి స్కూల్‌లో తుపాకీతో కాల్పులు జరిపాడని, దీనిపై విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్