మెట్లపై నుంచి జారిపడి గురుకుల విద్యార్థిని మృతి

66చూసినవారు
మెట్లపై నుంచి జారిపడి గురుకుల విద్యార్థిని మృతి
TG: సంగారెడ్డి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో షాదిహా మెహరీన్ (14) అనే విద్యార్థిని శనివారం రాత్రి భోజనం చేసి, తన రూమ్‌కి వెళ్లే క్రమంలో మెట్లపై నుంచి జారి కిందపడింది. దీంతో షాదిహా తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్