ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఉతప్ప స్పందించాడు. ‘సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ పదవీకి రాజీనామ చేశా. నేను ఇచ్చిన ఫండ్స్‌ను కూడా తిరిగి చెల్లించడంలో ఈ సంస్థ విఫలమైంది. కంపెనీకి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. త్వరలో ఈ సమస్యను అధిగమిస్తా’ అని ఉతప్ప తెలిపాడు.