ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది: వెంకయ్యనాయుడు

53చూసినవారు
ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది: వెంకయ్యనాయుడు
రామోజీరావు మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని వ్యాఖ్యానించారు. ‘రామోజీరావు వ్యక్తి కాదు.. శక్తిమంతమైన వ్యవస్థ. స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారు. ఒక ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్‌ తరాలకు ఆదర్శం, ఆయనతో మాట్లాడటం వల్ల ఎంతో పరిపక్వత సాధిస్తాం. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్