భారీ వరద. పేక మేడలా కూలిన భవనం(వీడియో)

367628చూసినవారు
చైనాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల పైకి నీరు చేరింది. ఈ క్రమంలో వరదల ధాటికి ఓ భవనం పేక మేడలా కూలిపోయింది. కాగా అధికారులు ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ సూచించారు. మరో వైపు వరదల వల్ల రైల్వే వంతెన కూలిపోయింది. సిచువాన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 4.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

సంబంధిత పోస్ట్