హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.7 వేల కోట్లతో పరారైన డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ చైర్మన్

60చూసినవారు
హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.7 వేల కోట్లతో పరారైన డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ చైర్మన్
హైదరాబాద్‌లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ దుకాణం ఎత్తేసింది. సుమారు రూ.7 వేల కోట్ల స్కాం జరగినట్లు పోలీసులు గుర్తించగా.. డీబీ స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ అస్సాం రాష్ట్రానికి చెందిన దీపాంకర్ బర్మన్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌తోపాటు ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గౌహతి, ఢిల్లీలోనూ వీరిపై కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 23 వేలకు పైగా బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్