లాంగ్ డ్రైవ్‌లు, విహారయాత్రలకు వెళ్లాలనే ప్రియురాలి కోరికను తీర్చడానికి ఫోన్లు, వాహనాలను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కు అలవాటు పడటంతో నిందితుడు ఓం ప్రకాష్ గతంలో ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగం కోల్పోయాడని ఢిల్లీ ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ తెలిపారు. "తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి దొంగతనం చేయాలని ప్రకాష్ ను ప్రియురాలు ప్రోత్సహించింది" అని పోలీసులు చెప్పారు.