కుంటలో పడిన కూతురిని రక్షించబోయిన తల్లి.. ఈత రాక ఇద్దరూ దుర్మరణం

65చూసినవారు
కుంటలో పడిన కూతురిని రక్షించబోయిన తల్లి.. ఈత రాక ఇద్దరూ దుర్మరణం
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో విషాదం చోటుచేసుకుంది. కాటిపేరి గ్రామానికి చెందిన కుమార్‌రెడ్డి, మౌనిక (30) దంపతులకు కూతురు అనీశారెడ్డి(7) ఉంది. మదనపల్లెలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆదివారం మౌనిక తమ ఆవులకు నీళ్లు తాగిస్తుండగా.. కుమార్తె అనీశా ఓ ఆవు తాడును పట్టుకుంది. ఇంతలో ఆవు బెదిరి పాపను కుంటలోకి ఈడ్చుకెళ్లింది. చిన్నారి మునిగిపోతుండటంతో బిడ్డను కాపాడేందుకు మౌనిక కుంటలో దూకారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీట మునిగి చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్