ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లలో పొటాషియం, విటమిన్ ఇ, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా గుడ్డులో మాంసకృత్తులు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుంది. మధుమేహం, టైప్-2 మధుమేహం వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది. గుడ్డు తినడం వల్ల కళ్లు, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుంది.