స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై హత్య కేసు నమోదు

66చూసినవారు
స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై హత్య కేసు నమోదు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ కు షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదయింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని తండ్రి రఫీకుల్ ఇస్లామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ అల్ హసన్ 28వ నిందితుడిగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్