దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయీ వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్‌ను కూడా మోదీ విడుదల చేశారు. మరోవైపు వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు.