వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 143 మంది మృతి

63చూసినవారు
వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 143 మంది మృతి
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రకాల కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఒక ‘మిస్టరీ డిసీజ్’ ఆందోళనకరంగా మారింది. ఈ కొత్త వ్యాధితో రెండు వారాల్లో 67 నుంచి 143 మంది మరణించారు. వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తహీనత, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మహిళలు, పిల్లలు దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అధికారులు ఈ మరణాలకు కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you