పదేళ్ల బాలుడిపై నర్సరీ విద్యార్థి కాల్పులు (వీడియో)

66చూసినవారు
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలుడు మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. సుపాల్ జిల్లా లాల్‌పట్టి ప్రాంతానికి చెందిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. అయితే ఆ బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు బాధిత విద్యార్థిని ప్రశ్నించారు. అయితే బాలుడు తనపై ఎందుకు కాల్పులు జరిపాడో తెలియదని బాధితుడు చెప్పాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్