ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నారాయణ్ వఘుల్ (88) కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1981లో అతి చిన్న వయసులో (44) బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 1985లో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్, సీఈఓగా పనిచేసిన నారాయణ్.. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 2009 వరకు సంస్థకు సేవలు అందించారు.