మహిళను చుట్టేసిన కొండచిలువ.. షాకింగ్ వీడియో

66చూసినవారు
థాయ్‌లాండ్‌లోని సముత్ ప్రకాన్‌ ప్రాంతంలో ఈ నెల 17న షాకింగ్ ఘటన జరిగింది. 64 ఏళ్ల ఆరోమ్ అరుణ్‌రోజ్‌ ఇంటి వద్ద వంట పాత్రలు కడుగుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ పెద్ద కొండచిలువ ఆమెను చుట్టేసి, ఉక్కిరిబిక్కిరి చేసింది. బాధితురాలి కేకలు విన్న చుట్టు పక్కల ప్రజలు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్