ఎన్టీఆర్ బామ్మర్ది, నార్నె నితిన్ నిశ్చితార్థం శివాని అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. ఆదివారం వీరి నిశ్చితార్థానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు వెంకటేష్, దగ్గుబాటి ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. తాజాగా ఆ కార్యక్రమంలో హీరో వెంకటేష్ ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో సరదాగా ఆడుకుంటున్నారు. వారిని దగ్గరకు తీసుకొని వెంకీ మామ ముచ్చట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.