ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో 13 మంది మృతి

55చూసినవారు
ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో 13 మంది మృతి
పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని ముజఫర్‌గఢ్ జిల్లాలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన ట్రక్కు అదుపు తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను అది ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడడించారు. ముల్తాన్‌లోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :