కోల్‌కతా గెలిచింది కాబట్టి ఏపీలో ఆ పార్టీదే అధికారం?

73చూసినవారు
కోల్‌కతా గెలిచింది కాబట్టి ఏపీలో ఆ పార్టీదే అధికారం?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేస్తున్న ట్వీట్లు, పోస్టులు బాగా వైరలవుతున్నాయి. 2014లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ ను ఒకసారి గుర్తుచేసుకోవాలంటున్నారు. ఆ సంవత్సరంలో జరిగిన ఫైనల్ లో కూడా KKR.. పంజాబ్ పై విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. అదే సంవత్సరం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో TDP ఘనవిజయం సాధించింది. ఈసారి కూడా అలాగే జ‌ర‌గ‌డంతో ఏపీలో కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌ని పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్