కర్ణాటకలోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్‌లో 15 రోజుల్లో ఏడు చిరుత కూనలు మృత్యువాత పడ్డాయి. అయితే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర అంటువ్యాధి ‘ఫీలైన్ పాన్ల్యూకోపెనియా’ కారణంగా అవి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన కూనల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంది. ఆగస్టు 22న మొదటిసారి వైరస్ వ్యాప్తిని గుర్తించామని పార్కు ఈడీ చెప్పారు.