అమెరికాలో రాట్ వీలర్ జాతి కుక్కతో దాడి చేయించి ప్రియుడి 9 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

566చూసినవారు
అమెరికాలో రాట్ వీలర్ జాతి కుక్కతో దాడి చేయించి ప్రియుడి 9 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళ ప్రియుడి కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేసింది. 34 ఏళ్ల టైషెల్ ఎలిస్ మార్టిన్ అనే మహిళ ప్రియుడి 9 ఏళ్ల కుమార్తెను కొట్టి, అనంతరం తన 47 కిలోల రాట్ వీలర్ జాతి కుక్కతో దాడి చేయించి చంపింది. అయితే జూన్ 17న బాలిక ఉన్నట్లుండి పడిపోయిందని సదరు మహిళ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు కావడంతో సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్