వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని కడప పీఎస్కు తరలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్, వంగలపూడి అనితపై రవీంద్ర అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఇటీవల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేయడంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. కడప ఎస్పీపై బదిలీ వేటు వేసింది.