చలికాలం మొదలుకావడంతో చాలా మంది వేడినీళ్ల కోసం గీజర్లు, వాటర్ హీటర్ల మీదే ఆధారపడుతుంటారు. అయితే వీటిని సక్రమంగా వాడకపోతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఏడాదికోసారి గీజర్‌కు సర్వీస్ చేయించాలి. అలాగే తుప్పు పట్టినట్లు గమనిస్తే ఆ గీజర్‌ను వాడకపోవడం బెటర్. నీళ్లు వేడి కాగానే ఆటోమేటిగ్గా ఆఫ్ అయ్యే టైమర్ ఫీచర్ ఉన్న గీజర్‌ను వాడడం మంచిది.