పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా నివాసి సమీర్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్ల పాకిస్తాన్ యువతి భారత్‌కు వచ్చింది. జవేరియా
ఖానుమ్‌గా గుర్తించబడిన ఈ యువతికి అట్టారీ సరిహద్దులో సమీర్, అతడి తండ్రి అహ్మద్ కమల్ ఖాన్ స్వాగతం పలికారు. గతంలో రెండు సార్లు ఆమె వీసాను తిరస్కరించిన
భారత్ ఆమెకు 45 రోజుల వీసాను మంజూరు చేసింది. 2018లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.