తమిళనాడులోని రామేశ్వరం- తాంబరం మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన సిద్ధమైంది. పంబన్ బ్రిడ్జి పాతబడి పోవడంతో కేంద్రం కొత్త వంతెనను నిర్మించింది. పనులు పూర్తి కావడంతో అధికారులు శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏప్రిల్ 6న ఈ వంతెనను ప్రారంభించనున్నారు.